News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News January 24, 2026
సుల్తానాబాద్: ‘రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

సుల్తానాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గట్టెపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు సజావుగా నిర్వహించాలని, విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన ప్రజలను తరలించి పాత ఇండ్ల కూల్చివేత పనులు రెండు రోజులలో పూర్తి చేయాలని తెలిపారు. ఆసుపత్రి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ అన్నారు.
News January 24, 2026
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలకు 541 పోలింగ్ కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు 541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలు అన్ని వసతులు ఉండేలా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వివరాలు టీ-పోల్ లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News January 24, 2026
KTRను నేరస్థుడిగా పరిగణించలేదు: జూపల్లి

TG: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతోందని, కేటీఆర్‌కు CRPC 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను నేరస్థుడిగా పరిగణించలేదని, సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచారని తెలిపారు. ప్రభుత్వానిది రాజకీయ కక్ష అనడం సరికాదని, కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాలని పేర్కొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.


