News November 19, 2025

HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

image

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.

Similar News

News January 18, 2026

మందమర్రి మున్సిపల్ .. వివాదాల కొర్రి!

image

జిల్లాలో 30 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా అవతరించిన మందమర్రి వివాదాల కారణంగా ఎన్నికలకు నోచుకోవడం లేదు. ఈసారి కూడా ఎన్నికలు జరగటం లేదు. 30ఏళ్ల క్రితం 1/70 చట్ట పరిధిలో ఉన్న మందమర్రిని మున్సిపాలిటీ చేసి ఎన్నికలకు రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ SC రిజర్వు కావడంతో ST వర్గానికి చెందిన పెద్దలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 3దశాబ్దాలుగా పాలకులు లేకుండా కొనసాగుతోంది.

News January 18, 2026

VKB: మద్యం అక్రమంగా అమ్మితే 25 చెప్పు దెబ్బలు, రూ.5లక్షల ఫైన్

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మదన్‌పల్లిలో గ్రామస్థులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. బెల్ట్ షాపులను ఎవరూ నిర్వహించొద్దని తీర్మానం చేశారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని అమ్మితే 25 చెప్పు దెబ్బలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తామని ముక్తకఠంతో తేల్చిచెప్పారు. గ్రామంలో ఉన్న అన్ని షాపుల యజమానులకు దీనిపై అవగాహన కల్పిస్తూ తీర్మాన పత్రాన్ని పదర్శించారు.

News January 18, 2026

X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

image

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్‌కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.