News November 19, 2025

HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

image

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.

Similar News

News January 23, 2026

VKB: 1800-102-7222కు కాల్ చేయండి

image

జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌-12లో 106 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరిలో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. యజమానులు 14ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1908, 1800-102-7222, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 23, 2026

విశాఖ: మద్యం డబ్బుల కోసం RTC బస్సు చోరీ

image

మద్యం డబ్బుల కోసం ఓ వ్యక్తి APSRTC బస్సును దొంగిలించాడు. ఈ ఘటన జనవరి 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అనకాపల్లి (D) మారేడుపూడికి చెందిన పైడిరాజును ఈనెల 19న పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

News January 23, 2026

ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు వెల్లుల్ల మహిళ

image

మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన జాగృతి మహిళ మండల సమాఖ్య అధ్యక్షురాలు గోర్ల లతకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. గొర్ల లత స్వశక్తి సంఘంలో చేరి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా, జాగృతి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడి జిల్లా మహిళ సమాఖ్య ఈసీ మెంబర్గా ఉన్నారు. గణతంత్ర వేడుకలకు ఎంపికైన ఆమెను ఏపీఎం, సీసీలు, మహిళ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు అభినందించారు.