News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్‌ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
Similar News
News February 7, 2026
ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News February 7, 2026
రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.
News February 7, 2026
APPLY NOW: C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<


