News November 19, 2025

HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

image

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Similar News

News January 16, 2026

షుగర్ పేషంట్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా?

image

డయాబెటిస్‌ ఉన్నవారు బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చేయడం మంచిదే. కానీ జాగ్రత్తలు తప్పనిసరి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినా.. సరైన ప్లాన్ లేకపోతే ప్రాణాల మీదకు రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు తినకుండా ఉంటే షుగర్ లెవల్స్ పడిపోతాయి. అలాగే ఉపవాసం తర్వాత ఒక్కసారిగా తింటే షుగర్ అదుపు తప్పుతుంది. అందుకే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణులు దీనికి దూరంగా ఉండాలి.

News January 16, 2026

GOOD NEWS.. విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగలు పూర్తయిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు(08517/18) నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు జనవరి 18న మధ్యాహ్నం 3:50కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30కు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి 19న ఉదయం 9గంటలకు బయలుదేరి 20న అర్ధరాత్రి విశాఖ చేరుతుంది.

News January 16, 2026

అల్లూరి: రూ.3 వేలు పలికిన ‘కోస’

image

కనుమ పండుగ రోజున జిల్లాలో కోడి పుంజు కోసకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడి (కోస) కోసం జనాలు ఎగబడ్డారు. జీడీపప్పు, బాదం, పిస్తాల మేతతో పెంచిన ఈ కోడి రుచే వేరని అంటున్నారు. 2 కిలోల కోడి రూ.3వేలు వరకు పలుకుతుందని పలువురు అంటున్నారు. గత ఏడాది రూ.1500 ఉండేదని తెలిపారు.