News November 19, 2025

HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

image

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Similar News

News January 22, 2026

భారత ప్లేయర్‌కు గాయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.

News January 21, 2026

అలర్ట్.. దుర్గమ్మ ఆలయం నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మకండి

image

కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో వస్తున్న నకిలీ ఫోన్ కాల్స్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ కోరారు. కొంతమంది వ్యక్తులు ఆలయ సిబ్బందిమని చెప్పుకుంటూ భక్తులను మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బుధవారం ఆయన తెలిపారు. ఇవి సైబర్ మోసాలు అయ్యే అవకాశం ఉందని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు లేదా నగదు పంపవద్దని సూచించారు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా తమను సంప్రదించాలని స్పష్టం చేశారు.

News January 21, 2026

కంచికర్ల: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

కంచికచర్ల పట్టణంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సొసైటీ బజార్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న అబ్బూరి హరిబాబు (35) సూసైడ్ చేసుకున్నాడు. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురైన హరిబాబు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.