News November 30, 2025

HYD: ప్రారంభం సరే.. మరి పోస్టుల సంగతేంటి సారూ.?

image

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న ప్రారంభించి బహుమతిగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ప్రారంభోత్సవంపై నీలి నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఆస్పత్రిలో అసలు సిబ్బంది నియామకమే జరగలేదు. సేవలందించేందుకు మొత్తం ఎంతమంది అవసరం అనేది వైద్యశాఖ కనీసం అంచనాకు కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రారంభోత్సవం జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

Similar News

News February 11, 2026

HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

image

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.

News February 11, 2026

GHMC స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్

image

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను బాధ్యతలు స్వీకరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. GO 203 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి 3 కార్పొరేషన్ల బాధ్యతలు ఆయన చూసుకోనున్నారు.

News February 11, 2026

GHMCపై కొత్త బాస్‌ల సంతకం

image

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్‌గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.