News November 19, 2025

HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

image

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.

Similar News

News January 12, 2026

సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్ ఇదే..!

image

సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం శేషాచల లింగేశ్వరస్వామి దేవస్థానం, ఎ-రంగంపేట– భీమవరం రోడ్డు ప్రారంభిస్తారు. నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తిరుపతి SV యూనివర్సిటీలో గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ ప్రారంభించనున్నారు.

News January 12, 2026

చైనా మాంజా అమ్మితే ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

image

జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన ఈ మాంజా వల్ల మనుషులకు, పక్షులకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మాంజాను కొనివ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 12, 2026

విజయవాడలో పుస్తకాన్ని కార్గోలో పార్శిల్ చేసిన RTC ఎండీ

image

APSRTC కార్గో సేవల ప్రచారంలో భాగంగా RTC వీసీ&ఎండీ ద్వారకా తిరుమలరావు విజయవాడ బస్టాండ్‌లో నూతనంగా నిర్మించిన కార్గో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ‘Don’t Lose Your Mind, Lose Your Weight’ పుస్తకాన్ని ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ ద్వారా పంపించారు. కార్గో సేవలను ప్రతి ఉద్యోగి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. పుస్తకాల ఖర్చు, కార్గో ఛార్జీలు ఆయనే చెల్లించారు.