News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News January 20, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుహిన్ సిన్హా

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్స్, కేవైసీ లింకుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థలు వీడియో కాల్స్ చేసి డబ్బులు అడగవని స్పష్టం చేశారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
News January 20, 2026
పాలమూరు: పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత శిక్షణ

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. గ్రూప్-1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, SSC, RRB పరీక్షలకు ఈ శిక్షణ ఉంటుంది. NRPT కలెక్టర్ సిక్తా పట్నాయక్ కరపత్రాలను ఆవిష్కరించారు. డిగ్రీ చేసిన ST, SC, BC, మైనారిటీ అభ్యర్థులు అర్హులు. ఈనెల 30లోగా https://www.tsstudycircle.co.in” నందు దరఖాస్తు చేసుకోవాలి.
News January 20, 2026
ఆసిఫాబాద్: ‘ప్రాక్టికల్స్‌కు రాకపోతే గైర్హాజరైనట్లే’

రేపు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఎల్లుండి 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి(DIEO) రాందాస్ తెలిపారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఉదయం 9 గంటలకు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతివిద్యార్థి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు గైర్హాజరైనవారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.


