News November 19, 2025

HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

image

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.

Similar News

News January 17, 2026

ప.గో: పల్లె నుంచి పట్నం బాట

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో జనం పల్లె నుంచి పట్నం బాట పట్టారు. ఉమ్మడి ప.గో జిల్లా నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. శనివారం భీమవరం, ఏలూరులో రద్దీ పోటెత్తింది. విజయవాడ మీదుగా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపారు. ఏలూరులో రాత్రి వేళ కూడా విజయవాడ నాన్‌స్టాప్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరడం రద్దీ తీవ్రతకు అద్దం పట్టింది.

News January 17, 2026

రేగిపండ్లతో లాభాలెన్నో..

image

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

News January 17, 2026

HYD: ఒకేసారి 20 మంది IPS అధికారుల బదిలీ

image

ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. DGP ఆదేశాల మేరకు 20 మంది IPSలు బదిలీ అయ్యారు. గజరవు భూపాల్, అభిషేక్ మహంతి, భాస్కరన్, చందనా దీప్తి, అన్నపూరణ, రహుల్ హెగ్డే, అపూరవరవు, బాలస్వామి, వెంకటేశ్వరులు, చైతన్య కుమార్, అవినాశ్ కుమార్, కాజల్, శేషాద్రిని రెడ్డి, కంకనాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, శ్రీనివాసులు, రంజన్ రథన్ కుమార, శ్యామ్ సుందర, అశోక్, బాలకోటి బదిలీ అయ్యారు.