News August 23, 2025

HYD: బంగారం తాకట్టు పెడుతున్నారా? జాగ్రత్త!

image

బ్యాంక్ చెక్కుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంగారం తాకట్టుపెట్టి ఎక్కడైనా చెక్కును తీసుకున్నారా? ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. తమిళనాడుకు, ఛత్తీస్‌గఢ్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన వ్యాపారులు HYDలో పలుచోట్ల బంగారం తాకట్టు పెట్టుకుని, FAKE చెక్కులు ఇస్తున్నారు. కావాల్సిన బంగారం వచ్చాక పారిపోతున్నారు. ఇటీవల ఈ స్కామ్‌లు నగరవాసులను కలవరపెట్టాయి. జాగ్రత్త!

Similar News

News January 23, 2026

HYD: ట్రెండింగ్‌లో నైట్ లైఫ్!

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సరికొత్త నైట్ లైఫ్ సెంటర్‌గా మారింది. పగటి ఆఫీసు గొడవలు పక్కనపెట్టి రాత్రుళ్లు భజన రేవ్‌లు, ‘ఫ్లోర్-హాప్’ ఈవెంట్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నో-గ్రైండ్ గ్లో’ పేరుతో హడావుడి చేస్తూ కష్టపడి పనిచేయడం కంటే, లైఫ్‌ను ప్రశాంతంగా గడపడమే ముఖ్యమని చాటిచెబుతున్నారు. షీ-టీమ్స్ నిఘా ఉండటంతో మహిళల సందడి పెరిగింది. దీంతో నగర నైట్ ఎకానమీకి కొత్త ఊపిరి పోస్తోంది.

News January 23, 2026

HYDలో ఇక ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్!

image

సిటీలో ప్రాపర్టీ వెరిఫికేషన్ ఇకపై డిజిటల్ మయం కానుంది. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం బల్దియా సరికొత్త ‘సెంట్రలైజ్డ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్’ను సిద్ధం చేసింది. ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ 3ఏళ్ల ప్రాజెక్టు కోసం 70:30 రేషియోలో టెక్నికల్ బిడ్డింగ్ నిర్వహించాలని GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. దీంతో పన్నుల ఆడిటింగ్ సులభతరం కానుంది.

News January 23, 2026

HYD: టీచర్‌పై లైంగిక దాడికి యత్నం

image

టీచర్‌ ఉద్యోగం కోసం పిలిచి లైంగిక దాడికి యత్నించిన స్కూల్ కరస్పాండెంట్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫతేనగర్‌లోని ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం ఓ టీచర్‌ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూ చేసిన సదరు కరస్పాండెంట్ జాబ్ ఇచ్చాడు. ఆమెతో చనువుగా మాట్లాడుతూ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయంపై PSలో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.