News June 17, 2024
HYD: బక్రీద్ సందడి.. 3 రోజులపాటు పొట్టేళ్ల కొనుగోళ్లు

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు పొట్టేళ్ల కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో నాలుగు రోజుల నుంచే పొట్టేళ్ల విక్రయాలు ఊపందుకోగా.. మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఒక్కో పొట్టేలు బరువుకు అనుగుణంగా రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు అమ్ముతున్నారు.
Similar News
News January 19, 2026
మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.
News January 19, 2026
హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
News January 19, 2026
HYD: రూ.లక్షలు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లు FREE

సనత్‌నగర్‌లో TIMS ఆసుపత్రిని గుండె, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ డిసీజ్ పేరిట ఏర్పాటు చేస్తున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో, 16 మెజర్ ఆపరేషన్ థియేటర్లతో, రూ.1100 కోట్ల వ్యయంతో 1000 పడకల ఆసుపత్రిగా నిర్మించారు. రూ.లక్షలు ఖర్చు చేసే గుండె వైద్యం ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందనుంది.


