News September 11, 2025

HYD: బతుకమ్మ పండగ జర్నీకి ఇబ్బంది ఉండొద్దు: DRM

image

బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో ఉంచుకుని HYD సికింద్రాబాద్ రైల్వే DRM డాక్టర్ గోపాలకృష్ణన్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు ఆర్టీసీ సహకరించి సరిపడా బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను కోరారు.

Similar News

News December 17, 2025

పెద్దకొడప్గల్: ఓటు వేయడానికి వస్తూ అనంతలోకాలకు..

image

ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామానికి వస్తున్న బిచ్కుంద (M) పుల్కల్ వాసి బక్కోల సాగర్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాగర్ మంగళవారం HYD నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పుల్కల్ బయలుదేరాడు. అయితే, బుధవారం పెద్ద కొడప్గల్ PS పరిధిలోని హైవేపై శవమై కనిపించాడు. మరొకరు తీవ్రగాయాలై కనిపించగా అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News December 17, 2025

సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.

News December 17, 2025

సూర్యాపేట: ఓటు వేసిన వందేళ్ల బామ్మ..!

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మఠంపల్లి మండలం బక్కమంతల గూడెం గ్రామంలో శతాధిక వయస్సు గల మామిడి నాగరత్నమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేయడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.