News November 8, 2025
HYD: ‘బస్తర్ హననంపై మీడియా మౌనం ఎందుకు’

దేశంలో దారుణమైన ఘటనలు జరిగినప్పుడు పలు కథనాలను ప్రచురించే మీడియా బస్తర్‌లో జరుగుతున్న హననంపై మౌనం ఎందుకు వహిస్తుందో గమనించాలని మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. SVKలో పౌర హక్కుల సంఘం తెలంగాణ 3వ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, అందుకే మీడియా సంస్థలు మౌనం వహిస్తున్నాయని అన్నారు. రఘునాథ్, ప్రొ.హరగోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
News January 23, 2026
తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలి: కలెక్టర్

ఎన్‌జీటీ ఆదేశాలతో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఏలూరులో అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించి, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
News January 23, 2026
మంచిర్యాల: ‘నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలి’

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు అందిస్తోన్న శిక్షణను సద్వినియోగం చేసుకొని శిక్షణలో నేర్చుకున్న అంశాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. పారదర్శకంగా, నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు.


