News November 20, 2025

HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

image

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

Similar News

News January 14, 2026

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

image

WPL-2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్‌జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.

News January 14, 2026

అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

image

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.

News January 14, 2026

సంగారెడ్డి: అంగన్‌వాడీలకు విద్యుదీకరణ, మరమ్మతులు

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, మరమ్మతులపై కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలకు తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విద్యుత్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.