News April 27, 2024
HYD: బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు.. అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SI నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సాయికిరణ్ అలియాస్ నాని (20) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కాచిగూడకు చెందిన ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. బాలికను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు.
Similar News
News April 18, 2026
KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026
రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.