News October 7, 2024

HYD: బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గోపిశెట్టి

image

తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. జెల్లి సిద్ధయ్య, మణికొండ వెంకటేశ్వరరావు, మంగళారపు లక్ష్మణ్, ఆత్మకూరి ప్రీతి, పొన్న సునీత పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

image

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.