News February 8, 2025
HYD: బీసీ లీడర్లతో కేటీఆర్ సమావేశం

బాచుపల్లిలోని ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బీసీ లీడర్లతో సమావేశం జరిగింది. ప్రభుత్వం కులగలను పేరుతో చేసిన సర్వేపై బీసీ హక్కులపై ఎలా పోరాడాలనే దానిపై బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపీ వివేక్, గంగుల కమలాకర్, మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.
Similar News
News February 17, 2026
అనకాపల్లి: 3,11,885 మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్స్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసుగల బాల బాలికలు 3,11,885 మందికి ఆల్బెంజోల్ టాబ్లెట్స్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DM&HO డాక్టర్ హైమావతి తెలిపారు. జిల్లాలో 1,908 అంగన్వాడీ కేంద్రాలు,1,856 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అనంతరం టాబ్లెట్స్ దగ్గర ఉండి వేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
News February 17, 2026
సుల్తానాబాద్ మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియ ముగిసినా, సుల్తానాబాద్‌లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. 15 వార్డులకు గాను కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించగా, అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలకపోవడంతో ఎన్నికను ఈరోజుకి వాయిదా వేశారు. ఛైర్మన్ రేసులో బిరుదు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, గాజుల రాజమల్లు, భాకం కిరణ్ యాదవ్‌ల పేర్లు వినిపిస్తుండగా, పీఠం ఎవరిని వరిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News February 17, 2026
నెల్లూరులో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in


