News August 14, 2025

HYD: బెట్టింగ్ యాప్ పరిమ్యాచ్ కేసులో ఈడీ సోదాలు

image

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ పరిమ్యాచ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. HYD సహా దేశ వ్యాప్తంగా 17 చోట్ల దాడులు చేశారు. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.110 కోట్లు ఫ్రీజ్ చేసి, డిజిటల్ డాక్యుమెంట్లు, మ్యూల్ ఖాతాల డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబై సైబర్ క్రైం PSలో పరిమ్యాచ్ డాట్ కామ్‌పై నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

image

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.

News March 13, 2026

రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

image

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.

News March 13, 2026

వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

image

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.