News March 27, 2024

HYD: బైక్ ఓవర్ టేక్.. యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్‌ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుండిగల్‌ నుంచి బైక్‌పై మేడ్చల్‌ వైపు వస్తున్న ఓంప్రకాశ్(23) స్థానిక అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నాడు. దీంతో ఓంప్రకాశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Similar News

News February 7, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @278

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 7, 2026

HYD: అవినీతికి నిలయంగా GHMC ‘ఇంజినీరింగ్‌’ విభాగం..?

image

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.

News February 7, 2026

HYD: తల్లీబిడ్డల ఆత్మహత్య.. చివరి కాల్‌ ఆయనతోనే!!

image

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన విజయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌ బుక్కులు, చెక్‌ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు.