News August 13, 2025
HYD: బోయిన్‌పల్లిలో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

హ్యాష్ ఆయిల్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. బోయిన్‌పల్లి ICRISAT ఫేజ్-2 గేట్ వద్ద డ్రగ్స్ పెడ్లర్లు సాహూ సోను, బందారి రవితేజను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8.95 లక్షల విలువైన 1,770 గ్రాముల హ్యాష్ ఆయిల్‌తోపాటు ఒక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇద్దరిపై NDPS కింద పూర్వ క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఏపీ నుంచి హ్యాష్ ఆయిల్ తెప్పించి చిన్నప్యాకెట్లుగా ముఠా అమ్ముతోందని గుర్తించారు.
Similar News
News March 17, 2026
వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ‘మ్యానువల్’ దోపిడీ!

వరంగల్ రైల్వే స్టేషన్ వాహనాల పార్కింగ్ కేంద్రంగా భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా వాహనదారులకు కంప్యూటర్ బిల్లులకు బదులు మ్యానువల్ బిల్లులు ఇస్తూ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంప్యూటర్ బిల్లుల్లో జీఎస్టీ కలిపి ఇస్తేనే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అయితే, మ్యానువల్ బిల్లుల ద్వారా వసూలు చేస్తున్న ఈ సొమ్ము పక్కదారి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
News March 17, 2026
జగిత్యాల: కలిసి పని చేస్తామన్న ఎమ్మెల్యే.. సాధ్యమేనా?

జగిత్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చలు కొనసాగుతుండగా, స్థానిక MLA స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే చెప్పినా, ఇరువురి మధ్య గతంలో ఉన్న విభేదాలు, వర్గపోరు నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సన్నద్ధమయ్యారు.
News March 17, 2026
20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.


