News December 11, 2025
HYD: బ్యాలెట్ పేపర్ చించేశాడు.. ఓటరుపై కేసు

శంషాబాద్‌లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి.. పొరపాటున మరొకరికి తన ఓటు వేశానని పేపర్ చింపివేసినట్లు విచారణలో తేలింది.
Similar News
News January 19, 2026
GO 16 మర్మం: సామాన్యుడికి శాపం.. బడా బాబులకు లాభం!

చెరువుల పరిరక్షణ ముసుగులో తెచ్చిన GO 16 నిబంధనలు అమలులోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు ఖాయం. సెక్షన్ 4 కింద రికార్డుల్లో లేని నాలాలకూ 400% TDR ఇస్తుండటంతో రియల్టర్లు అధికారులతో కుమ్మక్కై పనికిరాని గుంటలను ‘నాలా’గా చూపిస్తూ వేల కోట్ల నిర్మాణ హక్కులు పొందే ప్రమాదం ఉంది. సెక్షన్ 6 ‘TDR బ్యాంకు’లో జమ అయ్యే వివాదాస్పద భూములపై పారదర్శకత లేకపోతే బ్రోకర్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది.
News January 19, 2026
HYD: మున్సి‘పోల్’కు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు ఖరారు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను గాంధీభవన్ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని పార్లమెంట్ స్థానాలైన చేవెళ్లకు శ్రీధర్‌బాబు, మల్కాజిగిరికి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరికి సీతక్క పేర్లను ఖరారు చేసింది.
News January 19, 2026
మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.


