News October 7, 2025

HYD: భద్రతపై యాక్షన్ ప్లాన్ రెడీ: కర్ణన్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ జారీతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ ప్లాన్ రెడీ అయిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు.

Similar News

News January 14, 2026

HYD: ఇథియోపియా కాఫీకి ఇంత చరిత్ర ఉందా?

image

మనం రోజూ తాగే కాఫీ వెనుక ఓ అద్భుత కథ దాగి ఉంది. ఇథియోపియాలో 11వ శతాబ్దంలో మేకల కాపరి కఫా కొండ ఎక్కాడు. మేకలు చెర్రీలాంటి పండ్లు తిని ఉల్లాసంగా నర్తిస్తున్నాయని అతడు గమనించాడు. ఆశ్చర్యంతో అతడు గింజలను వేడి నీటిలో మరిగించి తాగగా, అపూర్వమైన ఉల్లాసాన్ని అనుభవించాడు. అదే కాఫీ. మన దేశానికి పరిచయం చేసింది మాత్రం అరబ్బులు. <<18855272>>పరేడ్ గ్రౌండ్<<>> స్వీట్ ఫెస్టివల్‌లో ఈ కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

News January 14, 2026

HYD: ఎంట్రీ FREE.. కైట్ ఫెస్టివల్‌కు వెళ్దాం పద!

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.

News January 14, 2026

BJP ఎంపీలు, ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్!

image

మున్సిపల్ ఎన్నికల వేళ TBJP శ్రేణులకు అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చింది. మున్సిపల్ పోరు పార్టీ గుర్తుపై జరుగుతుందని, MPలు, MLAలు క్షేత్రస్థాయిలో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. GP జోష్‌తో ఇప్పుడు పట్టణ కోటలపై జెండా పాతాలని పక్కా ప్లాన్ వేసింది. ‘BRS, రాష్ట్ర సర్కార్ విఫలమైంది.. BJPకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రచార బరిలోకి దిగనుంది.