News September 12, 2025

HYD: మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్!

image

నగర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా HYD పోలీసులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, అందరూ దీనికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, హెవీ ట్రిఫిక్ ఉండే రోడ్లు అవాయిడ్ చేయాలని సూచించారు.

Similar News

News December 10, 2025

TG గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా సిరిసిల్ల చీర

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో నల్లా విజయ్ ప్రత్యేకంగా ప్రదర్శించిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సిరిసిల్ల చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, హ్యాండ్ క్రాఫ్ట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాల్‌లో విజయ్ ఈ చీరను ప్రదర్శించగా సమ్మిట్‌లో పాల్గొన్న వ్యాపారవేత్తలు దీనిని ఆసక్తిగా తిలకించారు. చీరకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News December 10, 2025

కామారెడ్డి: స్కూల్ ఆటో బోల్తా.. టెన్త్ విద్యార్థి మృతి

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టెన్త్ విద్యార్థి ప్రణవ్(15) మృతిచెందగా గాయపడిన 14 మందిని ఆస్పత్రికి తరలించారు. దీంతో సావర్గావ్ గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 10, 2025

లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్

image

⋆ డైరెక్టర్ సుకుమార్‌ హానెస్ట్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారని హీరోయిన్ కృతిసనన్ ప్రశంసలు
⋆ ‘అఖండ-2’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో తమ ‘మోగ్లీ’ సినిమా విడుదలను DEC 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్
⋆ ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపుపై మరో GO జారీ చేసిన AP ప్రభుత్వం.. 11న ప్రీమియర్ల టికెట్ ధర ₹600, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో ₹75, మల్టీప్లెక్స్‌లలో ₹100 చొప్పున పెంపు