News January 29, 2025

HYD: మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య

image

యువకుడు వెంట పడటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాచారం పీఎస్ పరిధిలో జరిగింది. మల్లాపూర్ ప్రాంతానికి చెందిన యువతి(21) MBA 2nd ఇయర్ చదువుతోంది. గతంలో విద్యార్థితో సన్నిహితంగా ఉంటూ.. మనస్పర్దలు రావడంతో వారు దూరంగా ఉన్నారు. కాగా.. అతడు నెలనుంచి పెళ్లి పేరుతో వెంటపడుతున్నాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు రిమాండ్ చేశారు.

Similar News

News February 10, 2025

వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

image

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.

News February 10, 2025

కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

image

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News February 10, 2025

బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

image

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.

error: Content is protected !!