News September 13, 2025
HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్‌మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్‌లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్‌పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్‌కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
News December 9, 2025
నేడు అమరావతిలో పర్యటించనున్న మంత్రి నారాయణ

అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 నిమిషాలకు CRDA కార్యాలయం వద్ద బయలుదేరి అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రోడ్ల నిర్మాణ పరులను పరిశీలించి మీడియాతో మంత్రి మాట్లాడతారని వెల్లడించారు.
News December 9, 2025
వనపర్తి: ఊర్లో ఎన్నిక.. సిటీలో ప్రచారం

నగరంలో బతుకుదెరువు, పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి ఆయా వర్గాల ప్రజలు వచ్చి జీవిస్తుంటారు. ఈనెల14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి మండలం పెద్ద తండా(డి) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాత్లావత్ రాజ్యా నాయక్ బోయినపల్లి, బాపూజీనగర్, హస్మత్‌పేట, సెంటర్ పాయింట్ ఏరియాలలో ఓటర్లను కలిసి అభ్యర్థించారు.


