News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News January 17, 2026
నల్గొండ: మునిసి’పోల్స్ ‘కు ముందస్తు ప్రచారం!

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటర్ల తలుపు తడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం, పది రోజులుగా నల్గొండతో పాటు MLG పట్టణంలోని గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
News January 17, 2026
నారాయణపేట: GOVT స్కూల్ విద్యార్థులకు GOOD NEWS

నారాయణపేట జిల్లాలోని 512 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 59,870 మంది విద్యార్థులకు 22 రకాల విద్యా సామగ్రితో కూడిన స్కూల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. బెల్ట్, టై, నోట్‌బుక్స్, పెన్లు, పెన్సిళ్లు, బ్యాగులు తదితర అవసరమైన వస్తువులు ఈ కిట్లలో ఉండనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కిట్లు అందించడం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గి, చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం ఆలోచించింది.
News January 17, 2026
MBNR: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు అవకాశం

2026-27 విద్యా సంవత్సరానికి గాను Model Schools Admission Test (MSAT) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అభ్యర్థులు https://www.tsmodelschools.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఉమ్మడి జిల్లాలోని 8 ఆదర్శ పాఠశాలలకు గాను ఒక్కో పాఠశాలలో 100 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


