News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News January 20, 2026

తెనాలి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

image

భర్తను ప్రియుడితో కలిసి భార్య చంపిన ఘటన అనకాపల్లి(D) చీడికాడ(M) తూరువోలులో జరిగింది. DSP శ్రావణి వివరాలు.. భార్యభర్తలు కొండమ్మ, డేగల చిన్న కూలీ పనుల నిమిత్తం తెనాలి వెళ్లారు. అక్కడ మేస్త్రీ గణేశ్‌తో కొండమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త ఆమెను స్వగ్రామం తీసుకొచ్చాడు. చిన్న అడ్డు తొలగించుకోవాలనుకున్న.. గణేశ్ తన స్నేహితుడితో కలిసి 14న బైక్‌తో గుద్ది చంపి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు.

News January 20, 2026

జనగామ: రేపటి నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 20న ప్రథమ సంవత్సరం, 21న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ విభాగాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని 20 మార్కులకు పరీక్షిస్తారు. ఇందుకోసం అన్ని కళాశాలల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

News January 20, 2026

అనకాపల్లి: నేడు ఇన్ఛార్జి మంత్రి జిల్లాలో పర్యటన

image

జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం కె.కోటపాడు మండలం కింతాడ, బొట్టవానిపాలెం, గొండుపాలెంలో పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో విశాఖ ఉత్సవ్‌పై అధికారులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.