News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News January 20, 2026

భూపాలపల్లి జిల్లాలో 13 గ్రామాల్లో రీసర్వే: కలెక్టర్

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్ రీసర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. జిల్లాలో మొదట దశగా మొత్తం 13 గ్రామాలను రీసర్వే చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

News January 20, 2026

కూకట్‌పల్లి: భర్తను చంపిన భార్య

image

కూకట్‌పల్లిలోని ఓ కాలనీలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు హత్యగా తేలింది. సుధీర్ రెడ్డి (44)ని భార్య ప్రసన్న చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి సోదరి సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య ఉదాంతం బయటకొచ్చింది. నిందితురాలిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

News January 20, 2026

ASF: కేజీబీవీల్లో బోధనకు అధ్యాపకుల నియామకం

image

జిల్లాలోని కేజీబీవీ ఆసిఫాబాద్ (నీట్), కాగజ్‌నగర్ (ఐఐటీ), సిర్పూర్–టి (క్లాట్)ల్లో శని, ఆదివారాల్లో బోధనకు అధ్యాపకులను నియమించనున్నారు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, లా, ఆప్టిట్యూడ్ రీసనింగ్, ఇంగ్లిష్ సబ్జెక్టులు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బోధన అనుభవం అనుభవం ఉన్నవారు అర్హులు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది.