News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News January 24, 2026

సాలూరులో నేడు కలెక్టర్ ‘గ్రీవెన్స్’

image

సాలూరు MPDO కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు MPDO పార్వతి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో విధిగా హాజరుకావాలన్నారు.

News January 24, 2026

బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

image

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

TODAY HEADLINES

image

⋆ తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
⋆ ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు
⋆ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ
⋆ పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR
⋆ తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI
⋆ రెండో టీ20లో NZపై భారత్ విజయం
⋆ WHO నుంచి వైదొలగిన అమెరికా