News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News January 23, 2026
HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్‌లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.
News January 23, 2026
నందమూరులో మూడో రోజు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్

నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం సెషన్‌లో 180 మందికి గాను 172 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 180 మందికి గాను 174 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, ఆరుగురు హాజరు కాలేదని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.


