News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News January 18, 2026
వరంగల్: ఏడుగురు యువకుల అరెస్టు

వరంగల్ ఆటోనగర్ హిందూ శ్మశాన వాటిక వద్ద ఆదివారం సాయంత్రం గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తున్న వంశీ పవర్, అభినవ్, మంద సాయి రిత్విక్, కలకోట్ల విశ్వ, సిరంగి దివిజ్, బొమ్మిశెట్టి ధనుష్, విగ్నేష్ విహారి అనే ఏడుగురు గురు యువకులను గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నట్లు మట్టెవాడ CI కరుణాకర్ రావు తెలిపారు. యువకుల నుంచి సుమారు 70 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
News January 18, 2026
HNK: తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

తండ్రి మందలించాడన్న కారణంతో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో విఘ్నేశ్(17) అనే ఇంటర్ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హసన్‌పర్తి పోలీసులు తెలిపారు. విఘ్నేశ్ HNK రామారంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలో చేర్పించగా, కాలేజీకి వెళ్లకుండా చెడు తిరుగుల్లు తిరుగుతుండగా తండ్రి రమేశ్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.
News January 18, 2026
పెద్దపల్లి: ‘మున్సిపల్ ఎన్నికల్లో గౌడలకు 4 సీట్లు కావాలి’

మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీకే మద్దతు ఇస్తామని పెద్దపల్లి గౌడ సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో గౌడలకు 10 వేలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. 36 వార్డుల్లో కనీసం 4 సీట్లు గౌడలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.


