News January 12, 2025

HYD: మాజీ ఎంపీ మృతి పట్ల మంత్రి పొన్నం సంతాపం

image

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్ సభలో ఆయనతో పాటు మందా జగన్నాథం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని, ఉద్యమ సమయంలో తనతో కలిసి పని చేశారని, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహానికి గురై గుండెపోటుతో ఇబ్బందిపడ్డా ఉద్యమాన్ని ఆపలేదని గుర్తుచేసుకున్నారు.

Similar News

News February 9, 2025

HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

image

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్‌ చేశారు.

News February 9, 2025

హైదరాబాద్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

image

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.

News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!