News April 21, 2024
HYD: మానవత్వం చాటిన CI

నారాయణగూడ CI మానవత్వం చాటుకున్నారు. ఆదివారం TSRJC పరీక్ష రాయడానికి నల్గొండ నుంచి విద్యార్థిని వైష్ణవి నారాయణగూడకు చేరుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక పరీక్షా సెంటర్ అంబర్‌పేటలోని ప్రభుత్వం బాయ్స్ స్కూల్ అని తేలియడంతో రోడ్డు వెంబడి కంగారుగా బయల్దేరింది. ఇది గమనించిన CI చంద్రశేఖర్ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని 2 నిముషాల ముందే సెంటర్ వద్దకు చేర్చి, ఆదర్శంగా నిలిచారు.
Similar News
News December 17, 2025
HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.
News December 17, 2025
HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.