News September 12, 2025

HYD: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యుడు: రంగనాథ్

image

మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మ్యాన్‌హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని ఇందులో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్‌హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామన్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News December 17, 2025

ఇందల్వాయి హత్య.. పోలీసుల అదుపులో అనుమానితులు

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే <<18587725>>లారీ డ్రైవర్ <<>>హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా అనుమానితులను ఇందల్వాయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్రయన్ పల్లి వద్ద నిందితులు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

News December 17, 2025

మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

పల్నాడు: తస్మాత్ జాగ్రత్త.. క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు

image

క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు హెచ్చరించారు. ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో వచ్చే లింకులు, మెసేజీలు మోసపూరితమైనవి కావచ్చని తెలిపారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవొద్దని సూచించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు.