News August 19, 2025
HYD: మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకు..?: VH

రిలయన్స్, డీమార్ట్ లాంటి బడా కంపెనీల్లో అన్ని వస్తువులు దొరుకుతున్నప్పుడు.. మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకని మాజీ ఎంపీ హనుమంత్‌రావు అన్నారు. మంగళవారం HYD గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు.. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుంది.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.
Similar News
News January 23, 2026
ఈనెల 25 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు!

మేడారం మహాజాతర భక్తుల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు 290 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు హనుమకొండ డీఎం ధాంసింగ్ తెలిపారు. వరంగల్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 కాగా, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే, అగ్రహంపాడు జాతరకు కూరగాయల మార్కెట్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
News January 23, 2026
భూమనపై రమణ విమర్శలు

విజయసాయిరెడ్డి నమ్మినవారికి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి కరుణానంద స్వామిలా మారి శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి YCPకి రాజీనామా చేయడం జగన్ ఆడుతున్న డ్రామా అని, BJPలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.


