News November 20, 2025
HYD: మీసం తిప్పే వయసులో.. మత్తుకు చిత్తు

మీసం తిప్పే వయసులో యువత మత్తుకు చిత్తవుతున్నారు. ఇదే ఆసరాగా యువతకు డబ్బు ఆశ చూపి, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక డ్రగ్స్ కేసుల్లో యువకులు రవాణాదారులుగా ఉండటం కలవరపెడుతోంది. HYDలో గత ఆరేళ్లలో సుమారు 1,000 మందికిపైగా 12- 18 ఏళ్లవారే కేసుల్లో చిక్కకున్నట్లు తెలుస్తోంది. యుక్త వయసులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా వీడియోల ప్రభావం సైతం ఉందని తేలింది.
Similar News
News January 17, 2026
వరంగల్: మే తర్వాతే డివిజన్ల రిజర్వేషన్లు.!

వరంగల్ గ్రేటర్ నగరపాలక సంస్థ డివిజన్ల రిజర్వేషన్లు మే తర్వాత ఖరారు కానున్నాయి. ప్రస్తుతానికి మేయర్ పీఠం ఎవరికో మాత్రమే తేలింది. వరంగల్ గ్రేటర్ మేయర్ జనరల్‌కు ఖరారు కావడంతో మాజీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు, యువ నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈరోజే డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని అనుకొగా, మే వరకు ప్రస్తుత పాలక వర్గానికి సమయం ఉండటంతో, మే తర్వాతే రిజర్వేషన్లు తేలనున్నాయని అధికారులు తెలిపారు.
News January 17, 2026
నల్గొండ: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్ చంద్రశేఖర్

జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
News January 17, 2026
జిల్లాలో 5 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం: కలెక్టర్

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శనివారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నీతి ఆయోగ్ రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాకు ఈ కేంద్రాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.


