News August 23, 2025

HYD: మీ పోస్ట్ ఆఫీస్ పార్సల్ ఇలా ట్రాక్ చేసుకోండి..!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల నుంచి వివిధ ప్రాంతాలకు పార్సెల్, స్పీడ్ పోస్ట్ సర్వీసులు వేగంగా జరుగుతున్నట్లుగా ఉప్పల్ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం https://www.indiapost.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, కాన్సెంట్ నంబర్, క్యాప్చ లెటర్స్ ఎంటర్ చేసి, సర్చ్ బార్ నొక్కితే, ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చని వివరించారు. SHARE IT

Similar News

News January 18, 2026

HYD: మేడారం ‘బంగారం’ మీ ఇంటికే

image

మేడారం జాతర ప్రసాదం (బంగారం) ఇంటి వద్దకు పంపేందుకు HYD ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.299 చెల్లించిన వారికి ప్రసాదంతోపాటు వనదేవతల ఫొటోలు, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. TGSRTC ఆన్‌లైన్‌లో భక్తులు తమ వివరాలు నమోదు చేయాలని ఆర్టీసీ HYD అధికారి భద్రినారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించి 9154298733, 9154298865 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు.
# SHARE IT

News January 18, 2026

HYDలో ఆదివారం AQ @189

image

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.

News January 18, 2026

HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.