News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

News January 19, 2026

HYD: రూ.లక్షలు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లు FREE

image

సనత్‌నగర్‌లో TIMS ఆసుపత్రిని గుండె, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ డిసీజ్ పేరిట ఏర్పాటు చేస్తున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో, 16 మెజర్ ఆపరేషన్ థియేటర్లతో, రూ.1100 కోట్ల వ్యయంతో 1000 పడకల ఆసుపత్రిగా నిర్మించారు. రూ.లక్షలు ఖర్చు చేసే గుండె వైద్యం ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందనుంది.

News January 19, 2026

HYD: మూలికలతో మగతనం.. సాధ్యమా?

image

HYD రోడ్ల పక్కన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని మూలికలు, కషాయాలు అమ్మే షెడ్లు చూసే ఉంటారు. ఘట్కేసర్, ఉప్పల్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్, కీసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను DGCA అధికారులు పరిశీలించారు. వాటిలో శాస్త్రీయత లేదని, అలాంటివి నమ్మి మోసపోవద్దన్నారు. వీరు పురుషుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారని, అలాంటి దుకాణాలకు వెళ్లొద్దని, వెళ్లినా తెలివిగా వ్యవహరించాలని సూచించారు.

# SHARE IT