News November 16, 2025
HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 16, 2026
ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.
News January 16, 2026
జనవరి 16: చరిత్రలో ఈ రోజు

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం


