News November 19, 2025

HYD: ముందే ఉంటుంది మృత్యువు.. చూసి వెళ్లండి

image

శీతాకాలంలో పొగమంచు పెరగడంతో రోడ్లపై ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసు అధికారులతో సమీక్షించారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్న సీపీ, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు వంటి ముందస్తు చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News January 15, 2026

గజ్వేల్: KCR ఫాంహౌస్‌లో సంక్రాంతి సంబరాలు

image

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి KCR తన కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన సతీమణి శోభ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు కోడలు, మనవడు, మనవరాలితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

News January 15, 2026

సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

image

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర

News January 15, 2026

కనుమ రోజు గారెలు తింటున్నారా?

image

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.