News September 11, 2025
HYD: ముమ్మరంగా వరద సహాయక చర్యలు: మంత్రి

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం సహాయక చర్యలపై HYDలో సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. ఇప్పటి వరకు పరిహారం విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.
Similar News
News December 10, 2025
MBNRలో హై ఓల్టేజ్ ఫైట్.. తండ్రి, కూతురు ఢీ

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ జనరల్ స్థానం కోసం తండ్రి ముద్ధం రాములు, కూతురు ముద్ధం నవ్య శ్రీలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వీరిద్దరే బరిలో నిలవడం విశేషం. అంతేకాక, వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 17న కొల్పూర్ ఎన్నికల ఫలితం వెల్లడికానుంది.
News December 10, 2025
కృష్ణా: లంచాల భయం.. బీపీఎస్ మాకొద్దు బాబోయ్!

విజయవాడ, తాడిగడప, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నంలో అనధికార కట్టడాలు కోకొల్లలు. ఒక్క విజయవాడలో 10 వేలకు పైగా నిర్మాణాలు ఉంటే మిగతా చోట్ల 2వేల వరకు ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రెగ్యులరైజేషన్‌కు ఎవరూ ముందుకు రావడం లేదు.
News December 10, 2025
సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.


