News December 1, 2025
HYD మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్‌లో సైతం ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
Similar News
News February 10, 2026
HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.
News February 10, 2026
పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.. HYDలో ఖాళీలు ఇవే..!

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. HYD డివిజన్ పరిధిలో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్లో డాక్ సేవక్- 23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్-22, ABPM-9, BPM-10, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్-12, ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్ indiapostgdsonline.cept.gov.inలో అప్లై చేసుకోండి.
News February 10, 2026
HYDలో 2 రోజులు వాటర్ బంద్

ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌కాలనీ, ప్రగతినగర్‌కు నీటి సరఫరా ఉండదు. మంజీరా ఫేజ్- 2 మరమ్మతుల కారణంగా బుధవారం ఉ.6 నుంచి గురువారం రాత్రి 10 గం. వరకు వాటర్ నిలిచిపోతుంది.


