News October 6, 2025
HYD: మెట్రోలో సమయానికి మించి..!

మెట్రో నగరాల్లో ఫస్ట్& లాస్ట్ మైల్ కనెక్టివిటీలో HYD అధ్వానంగా ఉందని ట్రాఫిక్& రోడ్ సేఫ్టీ సమ్మిట్‌లో నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు HYD మెట్రో రైల్లో ప్రయాణించడానికి 29% సమయం వెచ్చిస్తుండగా, మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించడానికి 71% వెచ్చించాల్సి వస్తోందని ఈ బృందం తెలిపింది.
Similar News
News January 23, 2026
NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.
News January 23, 2026
కల్తీనెయ్యి కేసులో CBI ఫైనల్ ఛార్జిషీట్

తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీనెయ్యి వ్యవహారంపై CBI నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చగా, మరో 12 మందిని ఇందులో చేరుస్తూ ఇవాళ అభియోగపత్రం దాఖలు చేసింది. ఛార్జిషీట్లో 11 మంది TTD ఉద్యోగులు, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సహా AR డెయిరీ, భోలేబాబా డెయిరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి.
News January 23, 2026
NZB: హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం: సుదర్శన్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.


