News October 8, 2024

HYD: మెట్రో జోన్లో రూ.83 కోట్లతో విద్యుత్ పనులు

image

HYD మెట్రో జోన్ పరిధిలో రూ.83 కోట్లతో 939 DTRలు, ఫీడర్ల మార్పులు UG, AB కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ల పెంపు సైతం జరగనుంది. వచ్చే వేసవి కాలంలో కరెంటు డిమాండ్ దృష్టిలో ఉంచుకొని, TGSPDCL అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.

Similar News

News December 5, 2025

అసలేంటీ భారత్ ఫ్యూచర్ సిటీ?

image

TG టౌన్ ప్లానింగ్, ఆర్థికాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచే ఒక సాహసోపేతమైన అధ్యాయమే ఫ్యూచర్ సిటీ. ఫార్మా సిటీ, RRR, IT కారిడార్ల మధ్య వ్యూహాత్మకంగా 30K ఎకరాల విస్తీర్ణంలో నూతన నగరాన్ని(BFC) నిర్మించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గమనం, జీవన ప్రమాణాలను సమూలంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ సిటీలో ‘వాక్ టు వర్క్’ అనే విప్లవాత్మక కాన్సెప్ట్‌ హైలైట్‌ కానుంది.

News December 5, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌.. రూ. 5.91 కోట్ల దుబారా!

image

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్‌లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.

News December 5, 2025

సికింద్రాబాద్‌: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

image

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్‌పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్‌ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.