News June 20, 2024

HYD: యువతిపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ యువకుడిపై HYDకాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. CIలక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమాకు చెందిన యువతి(28) చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది. లక్డీకపూల్ వాసి విశాల్(27) ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరూ 2016నుంచి లవ్ చేసుకుంటున్నారు. కాగా ఆమెను కాదని మరొకరిని అతడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జిలో అత్యాచారం చేశాడని బుధవారం ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..

News January 14, 2026

HYDద్‌లో ‘ఫిన్లాండ్’ చదువుల జోరు

image

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ‘హారిజన్ ఎక్స్‌పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్‌లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.