News March 27, 2024
HYD: రాష్ట్రంలో టెట్ పరీక్ష ఫీజు రద్దు చేయాలి: వాసుదేవరెడ్డి

రాష్ట్రంలో టెట్ పరీక్ష ఫీజును వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేత కే.వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని కోరారు. HYD తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల రద్దు ప్రకటన జారీ చేయాలని కోరారు.
Similar News
News February 17, 2026
HYD: 99 ఏళ్ల లీజుకు మూసీ తీరం!

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో ఇప్పటివరకు బయటకు రాని విషయం ఏమిటంటే.. డ్రాఫ్ట్ ప్రపోజల్ ప్రకారం నదీ తీరాన స్వాధీనం చేసుకున్న భూములను “స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్లు” (SETZ) గా మార్చబోతున్నారు. అంతర్గత నివేదికల ప్రకారం.. సుమారు 58,000 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం ‘మానిటైజేషన్’ పద్ధతిని ఎంచుకుంది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన గట్టును 99 ఏళ్ల లీజుకు అంతర్జాతీయ సంస్థలకు కట్టబెడతారు.
News February 17, 2026
హైదరాబాద్ గడ్డపై ప్రపంచ ప్యాకేజింగ్ ‘దంగల్’

64 ఏళ్ల ఐసీసీఏ (ICCA) చరిత్రలో తొలిసారి HYDకు గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యం దక్కింది. 2027 జనవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్‌తో తెలంగాణ పేరు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్‌లో మారుమోగిపోనుంది. రూ.55 వేల కోట్ల విలువైన దేశీ ప్యాకేజింగ్ రంగానికి ఈ సదస్సు ఊపిరి పోయనుంది. హైదరాబాద్ దిగ్గజాలు ఎం.ఎల్. అగర్వాల్, అంకిత్ అగర్వాల్ సారథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. రేపు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుగుతోంది.
News February 17, 2026
రికార్డుల వేట.. ఎగవేతదారుల కోటలకు బీట!

సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఆస్తి పన్ను లెక్కల్లో మాయాజాలం చేసిన వారికి కాలం చెల్లింది. అద్దె విలువను (ARV) తక్కువ చూపిస్తూ పన్ను ఎగ్గొట్టే బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు సర్కార్ ‘డిజిటల్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. ఇంటి పన్ను పత్రం, కరెంటు మీటర్, రిజిస్ట్రేషన్ డేటా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇళ్లు అని చెప్పి సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, హాస్టళ్లు నడిపేవారికి కరెంటు బిల్లులే సాక్ష్యంగా మారుతున్నాయి.


