News September 12, 2025
HYD: రాష్ట్ర చిహ్నాలతో రాస్తాకు అందం

కూడళ్ల వద్ద ఎక్కువగా మహనీయుల విగ్రహాలే వెలిగిపోతుంటాయి. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌లో ఈ దృశ్యం విభిన్నంగా మెరిసిపోతోంది. TG గౌరవ చిహ్నాలను శిల్పకళాఖండంగా ప్రతిష్ఠించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇరువైపులా TG రాష్ట్ర జంతువులు మచ్చల జింకలు, మధ్యలో రాష్ట్ర పక్షి పాలపిట్ట సోయగం విరజిమ్ముతూ కనువిందు చేస్తోంది. ప్రయాణికుల చూపులను కట్టిపడేస్తోంది. మనసు దోచేస్తోంది.
Similar News
News December 15, 2025
వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.
News December 15, 2025
నవాబ్‌పేట్‌లో గెలుపొందిన సర్పంచ్‌లు వీళ్లే..

వట్టిమీనపల్లి- సుక్కమ్మొళ్ళ మాణెమ్మ (బీఆర్‌ఎస్)
మూలమాడ – కందాడ స్వాతి (బీఆర్‌ఎస్)
అత్తాపూర్ -మేకల సంతోష్‌రెడ్డి (కాంగ్రెస్)
ఎక్‌మామిడి – మహిళ నర్మద (కాంగ్రెస్)
ఎత్‌రాజ్‌పల్లి – మల్గారి జగన్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
చించల్‌పేట – -గుడిసె అనుసూజ (కాంగ్రెస్)
ముబారక్‌పూర్ ఎస్సీ జనరల్ జామ జేజయ్య (స్వతంత్ర)
News December 15, 2025
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.


