News May 5, 2024
HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 3, 2025
REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.


