News November 30, 2025

HYD: రూ.1147కే డ్రైవింగ్ లైసెన్స్!

image

పని ఈజీ అవుద్దని కొందరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తారు. ఇలా 2వీలర్‌ లైసెన్స్‌కు రూ.3000 నుంచి రూ.4000 వృథా చేస్తున్నారు. కానీ, LR పొందిన నెల తర్వాత DLకి అప్లై చేయొచ్చు. https://sarathi.parivahan.gov.inలో వివరాలు పొందుపరిచి, రూ.1147 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నాగోల్‌లో ట్రాక్ ఉంది. పైఫొటోలోని సర్కిల్ ‘8‌’ను కంప్లీట్ చేస్తే లైసెన్స్‌ వచ్చేస్తుంది. Dont Waste Money.
SHARE IT

Similar News

News February 14, 2026

రేపే బడ్జెట్

image

AP: రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10.30amకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 11.15amకు శాసనసభ, మండలి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై అచ్చెన్న బడ్జెట్ ప్రవేశపెడతారు. మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి.

News February 14, 2026

వరంగల్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల బదిలీలు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు మొత్తం 59 మందిని ఇతర ప్రాంతాలకు మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.

News February 14, 2026

మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

image

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.